
ఎకై ్సజ్ శాఖకు కిక్కు...
బల్క్‌గా టెండర్లు
● 116 వైన్స్‌కు 4,043 దరఖాస్తులతో రూ.121.29కోట్ల ఆదాయం ● గత పాలసీతో పోలిస్తే తగ్గిన ఆదాయం, దరఖాస్తులు ● చివరిరోజు రాత్రి పొద్దుపోయే వరకు స్వీకరణ
ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ కేటాయింపునకు గతనెల 26వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. అయితే, శుక్రవారం వరకు 2,390 దరఖాస్తులే నమోదు కాగా చివరిరోజు ఏకంగా 1,653 దరఖాస్తులు అందాయి. దీంతో జిల్లాలోని మొత్తం వైన్స్‌కు 4,043 దరఖాస్తులు అందగా ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున ఎకై ్సజ్ శాఖకు రూ. 121.29కోట్ల ఆదాయం సమకూరింది. గత పాలసీలో 122 వైన్స్‌కు గాను 7,200 దరఖాస్తులు రావడంతో రూ.2లక్షల చొప్పున రూ.144 కోట్ల ఆదా యం లభించింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెంచడంతోనే 3వేలకు పైగా దరఖాస్తులు తగ్గాయని భావిస్తున్నారు. కాగా, ఈనెల 23వ తేదీన లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయిస్తారు. డిసెంబర్ 1నుంచి నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా కొత్త వ్యాపారులు రెండేళ్ల కాలపరిమితితో వైన్స్‌ను ప్రారంభిస్తారు.
వారు సైతం రంగంలోకి...
గతంలో ఖమ్మంలోని వైన్స్ దక్కించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల మద్యం వ్యాపారులు ఆసక్తి చూపేవారు. కానీ ఈసారి ఉమ్మడి కృష్ణా నుంచే కాక విజయనగరం, వైజాగ్ వ్యాపారులు ముందుకు రావడం విశేషం. రెండు రోజుల క్రితమే ఖమ్మం చేరుకున్న వారు ఇక్కడే బస చేసి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ అమ్మకాలు ఉండే వైన్స్‌ను ఎంచుకుని టెండర్లు దాఖలు చేశారు.
పల్లీలు అమ్మే వ్యక్తి కూడా..
ఈసారి వైన్స్ దక్కించుకోవడానికి బడా వ్యాపారులే కాక చిరువ్యాపారులు సైతం ఆసక్తి కనబరిచారు. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని ఓ వైన్స్ ముందు పల్లీలు, ఇతర తినుబండారాలు అమ్మే ఓ వ్యక్తి అదే షాప్ కోసం టెండర్ దాఖలు చేశాడు. గత పాలసీలో మూడు దుకాణాలకు టెండర్ వేసినా దక్కలేదని ఆయన వెల్లడించాడు. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెరగడంతో ఒకే దరఖాస్తు దాఖలు చేశానని.. తప్పనిసరి షాప్ వస్తుందని నమ్ము తున్నట్లు చెప్పడం విశేషం.
ఎకై ్సజ్ అధికారుల ప్రచారంతో...
మద్యం టెండర్లు చాలారోజులు మందకొడిగానే నమోదయ్యాయి. కొన్నిరోజులైతే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఎకై ్సజ్ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. వ్యాపార వర్గాలతో సమావేశమవుతూ వైన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇలా సుమారు 25వేల మంది వ్యాపారులతో బృందాలుగా సమావేశాలు నిర్వహించినట్లు ఎకై ్సజ్ ఉద్యోగుల ద్వారా తెలిసింది. తద్వారా చివరి రోజు నాటికి భారీగా దరఖాస్తు నమోదయ్యాయని భావిస్తున్నారు.
మద్యం వ్యాపారులు ఈసారి పలు షాపులకు బల్క్‌గా దరఖాస్తులు వేశారు. ఓ బడా వ్యాపారి, ఆయన బృందం భద్రాద్రి జిల్లాలోని 70 షాపులకు టెండర్లు వేయగా, ఖమ్మం జిల్లాలోని సింగరేణి మినహా మిగతా అన్ని స్టేషన్ల పరిధిలో 150పైగా దరఖాస్తులు వేసినట్లు తెలిసింది. అలాగే, ఇంకో రెండు బృందాలు కూడా భారీగానే టెండర్లు దాఖలు చేశాయి. భారీగా అమ్మకాలు ఉంటాయని చెప్పే ఓ షాప్‌ను ఎంచుకున్న వ్యాపారుల బృందం పదుల సంఖ్యలో టెండర్లు వేసిందని సమాచారం. ఇక గ్రానైట్ వ్యాపారులు సైతం ఈసారి వైన్స్ దక్కించుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిసింది. కొన్ని ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 10మంది చొప్పున నగదు జమ చేసి ఒకటి, రెండుషాప్‌లకు టెండర్లు వేశారని సమాచారం. రిజర్వేషన్లు ఉన్న షాప్‌ల కోసం బడా వ్యాపారులు తమ బినామీలతో దరఖాస్తు చేయించారని చెబుతున్నారు.

ఎకై ్సజ్ శాఖకు కిక్కు...