ఖమ్మంఅర్బన్: జిల్లాలో జలవనరుల శాఖ ఆధ్వర్యాన జరుగుతున్న పనులను ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ ఓలేటి వెంకటరమేశ్‌బాబు శనివారం పరిశీలించారు. ఖమ్మం కై కొండాయిగూడెం వద్ద 21 ఎంబీబీసీపై వంతెన నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించడమే కాక టేకులపల్లి వంతెన సమీపాన ప్రధాన రహదారి పక్కన రిటైనింగ్ వాల్ నిర్మాణ స్థలంపై ఆరా తీశారు. అలాగే, వైరా మండలంలో రిజర్వాయర్ కాల్వల ఆధునికీకరణ పనులు, స్నానాల లక్ష్మీపురంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, చెక్‌డ్యాం పనులను పరిశీలించారు. పనుల నాణ్యత, నిర్మాణంలో సాంకేతిక అంశాలపై ఉద్యోగులకు సీఈ సూచనలు చేశారు. ప్రతిపాదిత పనుల్లో మార్పులు అవసరమైతే చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అనన్య, బాబూరావు, డీఈ గోపాల్‌రావు, ఏఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.