
2వేలు దాటిన వైన్స్ దరఖాస్తులు
ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ షాపులకు టెండర్ల స్వీకరణ గడువు శనివారంతో ముగియనుంది. అయితే, ఇన్నాళ్లు తక్కువగా దరఖాస్తులు అందగా, శుక్రవారం వీటి సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు ఇప్పటివరకు 2,050 దరఖాస్తులు అందగా, రూ.3లక్షల చొప్పున ఎకై ్సజ్ శాఖకు రూ.61.50కోట్ల ఆదాయం సమకూరింది. చివరిరోజైన శనివారం భారీగా దరఖాస్తులు నమోదయ్యే అవకాశముండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 5గంటల వరకు క్యూలో ఉన్న ప్రతీ ఒక్కరి దరఖాస్తు స్వీకరిస్తామని జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్‌రెడ్డి తెలిపారు. మొత్తంగా దరఖాస్తు ఫీజు రూపంలో రూ.100కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.