
స్వయం ఉపాధి.. ఆర్థిక స్వావలంబన
● ఇందిరా డెయిరీతో 20వేల మంది మహిళలకు లబ్ధి ● అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
బోనకల్: ఇందిరా డెయిరీ ఏర్పాటుతో మహిళలకు ఉపాధి లభించి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. డెయిరీలో వాటాదారులుగా చేరిన మధిర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండేసి పాడిగేదెలను సబ్సిడీ పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. బోనకల్‌లోని పాల శీతలీకరణ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించిన ఆమె డెయిరీ కేంద్రాలకే పాలు అప్పగించేలా మహిళల్లోఅవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం నియోజకవర్గ స్థాయి లబ్ధిదారులతో సమావేశమైన అదనపు కలెక్టర్ ఇప్పటివరకు అందిన గేదెల పోషణ, పాల ఉత్పత్తిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 125 మంది లబ్ధిదారులకు సబ్సిడీపై గేదెలు పంపిణీ చేయగా, నచ్చిన గేదెలు కొనుగోలు చేసుకునే వెసలుబాటు కల్పించినట్లు తెలిపారు. ఇప్పటికే ఎర్రుపాలెం మండలంలో రోజుకు 10వేల లీటర్ల పాలు కొనుగోలు చేసేలా బల్క్ మిల్క్ చిల్లింగ్(బీఎంసీ) సెంటర్ నిర్మించామన్నారు. అక్కడ పాల సేకరణ చేపడుతుండడంపై ఆమె అభినందించారు. మిగిలిన నాలుగు మండలాల్లోనూ బీఎంసీలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 60 వేల మంది సభ్యుల లక్ష్యం కాగా, మొదటి విడతలో 20 వేల మందికి లబ్ధి జరగనుందని అదనపు కలెక్టర్ తెలిపారు.
అధికారులపై ఆగ్రహం
పాల శీతలీకరణ కేంద్రం నిర్మాణ పనులు సక్రమంగా నిర్వహించడం లేదని అధికారులపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల శీతలీకరణ కేంద్రానికి వచ్చి, వెళ్లే మార్గాలపై సరైన నిర్ణయం తీసుకోకుండా నిర్మాణం చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. పాల వాహనాల రాకపోకలు ఎలా సాగుతాయని అసహనం వ్యక్తం చేసిన ఆమె ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఏపీఎం, డీపీఎం, ఏఈలపై మండిపడ్డారు. తొలుత మండలంలోని ముష్టికుంట్లలో భవిత భవన నిర్మాణాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్.. పాఠశాలలో గదులు ఉన్నా అదనంగా నిర్మిస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉన్న గదులను ఉపయోగించుకోకుండా ప్రభుత్వ ధనం వృథా చేయడం సరికాదని, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ ఆర్.సన్యాసయ్య, డీపీఎం శ్రీనివాస్, ఏపీడీ జయశ్రీ, ఇందిరా డెయిరీ ప్రత్యేకాధికారి రాజారావు, ఏపీఎంలు లక్ష్మణరావు, తిరుమలరావు తదితరులు