
శ్రీదుర్గాదేవిగా అమ్మవారి దర్శనం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజైన మంగళవారం వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం చేసిన అర్చకులు యాగశాలలోని అమ్మవారిని శ్రీదుర్గాదేవి రూపంలో అలంకరించారు. ఆపై చంఢీహోమం నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పశువైద్యాధికారిగా డాక్టర్ శ్రీనివాసరావు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బోడేపూడి పురంధర్ నాలుగు నెలల పాటు వ్యక్తిగత సెలవులో వెళ్లారు. దీంతో జిల్లా పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ బోడేపూడి శ్రీనివాస్‌రావు కు జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు రాష్ట్ర శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, శ్రీనివాసరావు వచ్చే ఏడాది జనవరి 29వరకు జిల్లా అధికారిగా వ్యవహరిస్తారు.
పులిగుండాలలో
ప్లాస్టిక్‌పై నిషేధం
సత్తుపల్లి: పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాంతాన్ని ఎకో టూరిజం విభాగంలో అభివృద్ధి చేయగా, ఈ ప్రాంతంలో ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు ఎఫ్‌డీఓ వాడపల్లి మఽంజుల తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సత్తుపల్లిలోని కార్యాలయంలో ఆమె అటవీశాఖ ఆధ్వర్యాన రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ స్టిక్కర్లను విడుద ల చేసి మాట్లాడారు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకుని గాజు బాటిళ్లు అందిస్తామని తెలిపారు. ఈ విషయంలో పర్యాటకులు సహకరించాలని సూచించారు. ఎఫ్‌ఎస్‌ఓ పి.సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
కోట మైసమ్మ జాతరకు భారీ బందోబస్తు
‘పొలం బాట’తో
సమస్యల పరిష్కారం
ఖమ్మంవ్యవసాయం: రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే కాక సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ‘విద్యుత్ అధికారుల పొలంబాట’ కొనసాగుతోందని ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. ఈమేర కు 447 లూజ్ లైన్లు, 226 వంగిన స్తంభాలను సరిచేయగా, 374 చోట్ల మధ్య స్తంభాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ సిబ్బందిని సంప్రదించేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్‌ఈ సూచించారు.

శ్రీదుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

శ్రీదుర్గాదేవిగా అమ్మవారి దర్శనం