
క్రీడల్లో జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలి
టీ.టీ.హాల్‌ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని.. వారి స్ఫూర్తితో యువత క్రీడారంగంలో ఎదిగి జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.50లక్షల కేఎంసీ నిధులతో నిర్మించిన నూతన టేబుల్ టెన్నిస్ హాల్‌ను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు అన్ని సదుపాయాలు ఉన్నందున రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని తెలిపారు. మరో క్రికెట్ స్టేడియానికి స్థలం కేటాయించినందున ప్రభుత్వానికి సమర్పించేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్, వీ.సాంబమూర్తితో పాటు పి.రవిమారుత్, కమర్తపు మురళి, ఆర్.ఉదయ్‌కుమార్, ఎం.డీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి పూజలు
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని పలు డివిజన్లలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంగళవారం జరిగిన పూజల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. 32వ డివిజన్ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో రథోత్సవానికి హాజరైన మంత్రి, 15వ డివిజన్ అల్లీపురంలో పూజలు చేయడమే కాక 10వ డివిజన్ పర్ణశాల రామాలయం వద్ద బతకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు రావూరి కరుణ, చావా మాధురి, కమర్తపు మురళితో పాటు మేళ్లచెర్వు వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సంక్రాంతి నాగేశ్వరరావు, సైదబాబు, నారాయణరావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలి