
నృత్య పోటీల్లో ఖమ్మం కళాకారుల ప్రతిభ
ఖమ్మంగాంధీచౌక్: కల్చరల్ ఫైన్ ఆర్ట్ ఫెడరేషన్ ఆదివారం హైదరాబాద్‌లోని బిర్లా మందిర్‌భాస్కర ఆడిటోరియంలో 9వ నేషనల్ డ్యాన్స్, అండ్ మ్యూజిక్ చాంపియన్‌షిప్ హైదరాబాద్–2025 పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో వివిధ ప్రాంతాల నుంచి నృత్యకారులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. ఖమ్మం నగరానికి చెందిన మీనా కూచిపూడి నృత్యాలయం కళాకారులు పలు అంశాల్లో ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలిచి అవార్డులను గెలుచుకున్నారు. కూచిపూడి జూనియర్స్ సోలో విభాగంలో భువన చద్దిక(బీటీఏ) ప్రథమ బహుమతి, సబ్ జూనియర్స్ విభాగంలో జ్ఞాన ప్రథమ బహుమతి, ఇదే విభాగంలో ద్వితీయ బహుమతి అపరంజిత, తృతీయ బహుమతి యాషిక, ఫోక్ సబ్ జూనియర్స్ విభాగంలో మాన్య ప్రథమ బహుమతి, గ్రూప్స్ విభాగంలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. నాట్య గురువు ఏలూరు మీనాకు ‘నాట్య విజ్ఞాన్’అవార్డు అందించి నిర్వాహకులు సత్కరించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మెమంటోలు, బహుమతులను అందించి అభినందించారు.

నృత్య పోటీల్లో ఖమ్మం కళాకారుల ప్రతిభ