
హోటళ్లు, రెస్టారెంట్లలోనూ బీర్ల విక్రయం
ఖమ్మం కార్పొరేషన్‌లో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు లైసెన్స్‌లు
ఈనెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఖమ్మంక్రైం: మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకు బార్‌లు, వైన్‌షాపుల్లో మాత్రమే లభ్యమయ్యే బీర్లు ఇక హోటళ్లు, రెస్టారెంట్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్టంలోని అన్ని నగరాల్లో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు లైసెన్స్‌లు మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది.
యూనిట్ ఏర్పాటు చేయాలంటే..
మైక్రో బ్రూవరీస్ యూనిట్ ఏర్పాటుకు 1000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రాంగణం కావాలి. ఈ యూనిట్లను రెస్టారెంట్లు, ఎలైట్ బార్లు, సీ1 క్లబ్, టీడీ1, టీ2 లాంటి లైసెన్స్ కలిగిన ప్రాంగణాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. 21 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు, డ్రగ్స్, కల్తీ మద్యం, గంజాయి విక్రయాల కేసుల్లో ఉన్నవారికి బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి లేదు. మైక్రో బ్రూవరీలో బీర్ల తయారీకి ప్రత్యేకంగా కిచెన్ ఏర్పాటు చేయాలి.
ఇలా దరఖాస్తు చేయాలి..
మైక్రో బ్రూవరీస్ యూనిట్ కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు సంబంధిత ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఐడీ ప్రూఫ్‌లతో పాటు రూ.లక్ష డీడీ జత చేసి దరఖాస్తులు చేయాలి. ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. అయితే మైక్రో బ్రూవరీస్‌లో ఎకై ్సజ్ నిబంధనల మేరకు మాత్రమే బీర్లు విక్రయించాలి. పార్కింగ్ కోసం 250 చదరపు మీటర్లు ఉండాలి. బ్రూవరీస్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఎయిర్ కండిషనర్ ఉండాలి. ఖమ్మంలో ఫ్యామి టీ రెస్టారెంట్లు నడిపే వారు మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
మైక్రోబ్రూవరీలో అప్పటికప్పుడు వివిధ రకాల బీర్లు తయారు చేసి విక్రయిస్తారు. ప్రస్తుతం బార్లు, వైన్‌షాపుల్లో విక్రయించే వివిధ బ్రాండ్‌లు కాకుండా ప్రత్యేకంగా తయారుచేసిన బీర్లు మాత్రమే బ్రూవరీలో లభ్యమవుతాయి. హైదరాబాద్‌లో వీటికి విపరీతమైన ఆదరణ ఉండడంతో నగరాల్లోనూ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.