breaking news
Micro Brewery
-
Telangana: మందుబాబులకు ఇక పండుగే !
ఖమ్మంక్రైం: మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకు బార్లు, వైన్‌షాపుల్లో మాత్రమే లభ్యమయ్యే బీర్లు ఇక హోటళ్లు, రెస్టారెంట్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్టంలోని అన్ని నగరాల్లో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు లైసెన్స్‌లు మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది.యూనిట్ ఏర్పాటు చేయాలంటే..మైక్రో బ్రూవరీస్ యూనిట్ ఏర్పాటుకు 1000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రాంగణం కావాలి. ఈ యూనిట్లను రెస్టారెంట్లు, ఎలైట్ బార్లు, సీ1 క్లబ్, టీడీ1, టీ2 లాంటి లైసెన్స్ కలిగిన ప్రాంగణాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. 21 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు, డ్రగ్స్, కల్తీ మద్యం, గంజాయి విక్రయాల కేసుల్లో ఉన్నవారికి బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి లేదు. మైక్రో బ్రూవరీలో బీర్ల తయారీకి ప్రత్యేకంగా కిచెన్ ఏర్పాటు చేయాలి.ఇలా దరఖాస్తు చేయాలి..మైక్రో బ్రూవరీస్ యూనిట్ కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు సంబంధిత ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఐడీ ప్రూఫ్‌లతో పాటు రూ.లక్ష డీడీ జత చేసి దరఖాస్తులు చేయాలి. ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. అయితే మైక్రో బ్రూవరీస్లో ఎకై ్సజ్ నిబంధనల మేరకు మాత్రమే బీర్లు విక్రయించాలి. పార్కింగ్ కోసం 250 చదరపు మీటర్లు ఉండాలి. బ్రూవరీస్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఎయిర్ కండిషనర్ ఉండాలి. ఖమ్మంలో ఫ్యామి టీ రెస్టారెంట్లు నడిపే వారు మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.మైక్రోబ్రూవరీలో అప్పటికప్పుడు వివిధ రకాల బీర్లు తయారు చేసి విక్రయిస్తారు. ప్రస్తుతం బార్లు, వైన్‌షాపుల్లో విక్రయించే వివిధ బ్రాండ్లు కాకుండా ప్రత్యేకంగా తయారుచేసిన బీర్లు మాత్రమే బ్రూవరీలో లభ్యమవుతాయి. హైదరాబాద్‌లో వీటికి విపరీతమైన ఆదరణ ఉండడంతో నగరాల్లోనూ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
మందేసి చిందేయమని..
సాక్షి, అమరావతి: కొత్త ఏడాదిలో రెడీ టూ డ్రింక్ పేరిట బీరు, వైన్ అమ్మకాల జోరు పెంచేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఇందుకోసం మైక్రో బ్రూవరీ బార్లకు తలుపులు బార్లా తెరిచింది. ప్రజల్ని మత్తులో ముంచి ఖజానా నింపుకునేందుకు ప్రధాన నగరాల్లో బీరు, వైన్ పార్లర్లకు విచ్చలవిడిగా అనుమతులిచ్చేస్తోంది. పాశ్చాత్య సంస్కృతి ప్రతిబింబించేలా విద్యా సంస్థలు, ఆస్పత్రుల వద్దే ఈ మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, 800 బార్లు సరిపోవన్నట్లు మైక్రో బ్రూవరీల కోసం అధికార పార్టీ నేతలు పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, విశాఖల్లో మైక్రో బ్రూవరీలకు ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చింది. ఇప్పుడు గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి నగరాల్లో బీరు, వైన్ పార్లర్లను ఏర్పాటు చేసేందుకు మద్యం సిండికేట్లు పోటీలు పడుతున్నారు. బీరు, వైన్ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఈ ర్యాంకును అధిగమించేందుకు ఏపీలో బీరు అమ్మకాలు పెరిగేలా ఈ మైక్రో బ్రూవరీలను ఏర్పాటుకు అనుమతులివ్వాలని సర్కారు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. బార్ పాలసీలో భాగంగా ఐదేళ్ల పాటు లైసెన్సులు కట్టబెట్టిన సర్కారు.. బీరు, వైన్ పార్లర్లకు శాశ్వత లైసెన్సులు జారీచేసే ఆలోచన చేస్తున్నట్లు ఎక్సైజ్ వర్గాలే వెల్లడించడం గమనార్హం. గతేడాది మద్యం పాలసీ రూపొందించినప్పుడే మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వం రూపొందించింది. ఆహారం సరఫరా చేసే ఏ ప్రాంతంలోనైనా బీర్, వైన్ పార్లర్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా పాలసీ తయారు చేసింది. అయితే ఇంతవరకు మైక్రో బ్రూవరీలపై నిబంధనలు రూపొందించలేదు. అయినప్పటికీ విజయవాడ, విశాఖలలో బ్రూవరీలను ఏర్పాటు చేశారు. ఈ బీర్, వైన్ పార్లర్లలో రెడీ టూ డ్రింక్‌లుగా మద్యం ఉత్పత్తుల్లో ఆల్కహాల్ శాతం ఏ మోతాదులో కలుపుతున్నారో, ఏ విధంగా అమ్మకాలు చేపడుతున్నారో ఎక్సైజ్ శాఖ వద్దే సమాచారం లేకపోవడం గమనార్హం. టూరిజంప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేసుకునే క్లబ్‌లలో మద్యం విక్రయించేందుకు అనుమతులివ్వాలని ఎక్సైజ్ శాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నిబంధనలు ఏవీ పట్టించుకోకుండా క్లబ్‌లు ఏర్పాటు చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో క్లబ్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు అనుమతులిచ్చారు. ప్రభుత్వ తీరుపై మద్యపాన నియంత్రణ కమిటీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. -
మైక్రో బ్రూవరీలకు గ్రీన్‌సిగ్నల్!
- 20 డ్రాట్ బీర్ల యూనిట్ల ఏర్పాటుకు సర్కార్ అంగీకారం - రూ. 3 లక్షల లెసైన్సు ఫీజుతో ఏర్పాటు కానున్న మైక్రో బ్రూవరీలు - మద్యం దుకాణాలు, బార్లలో బీర్ల అమ్మకాలపై ప్రభావం - త్వరలో జారీ కానున్న అధికారిక ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాజధానిలో బీరు తయారీ యూనిట్ల ఏర్పాటుకు త్వరలో అనుమతులు రానున్నాయి. తద్వారా రెస్టారెంట్లు, బార్లు నిర్వహిస్తున్న వ్యాపారులు సొంత బ్రాండ్‌తో బీరు తయారీ యూనిట్ (మైక్రో బ్రూవరీ)ను ఏర్పాటు చేసుకొని తమ రెస్టారెంట్లలో విక్రయించుకునే వీలు కలుగుతుంది. ఈ మేరకు మైక్రో బ్రూవరీల అనుమతి మంజూరు ఫైలుపై శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేసినట్లు తెలిసింది. మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు సంబంధించి గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా 50 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి 49 దరఖాస్తులు రాగా, ఒకటి వరంగల్ నుంచి వచ్చింది. వీటిని పరిశీలించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న 20 దరఖాస్తులను అర్హమైనవిగా గుర్తించింది. వీటికి అనుమతి మంజూరు చేయాలని ప్రభుత్వానికి పంపగా.. ఆబ్కారీ శాఖ మంత్రి టి. పద్మారావు వాటిని ఆమోదించి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా సొంత బ్రాండ్లతో బీర్ల తయారీ కోసం మైక్రో బ్రూవరీలకు అనుమతిస్తే కోట్లాది రూపాయల లెసైన్సు ఫీజులు చెల్లించి ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు, బార్లలో బీర్ల అమ్మకాలపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రూ. 3 లక్షల లెసైన్సు ఫీజుతో... గ్రేటర్ హైదరాబాద్‌లో మద్యం దుకాణం లెసైన్సు ఫీజు ఏడాదికి రూ. 1.08 కోట్లు ఉండగా, బార్‌కు రూ. 35 లక్షలు. క్లబ్బుల్లో బార్ ఏర్పాటు చేయాలన్నా రూ. 6 లక్షలు చెల్లించాలి. కానీ మైక్రో బ్రూవరీలకు మాత్రం వార్షిక లెసైన్సు ఫీజును రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. సొంత బ్రాండ్‌తో రోజుకు వెయ్యి బల్క్ లీటర్లకు మించకుండా డ్రాట్ బీరును ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ బ్రూవరీల్లో ఉత్పత్తి అయ్యే బీరు ఇతర ప్రాంతాలకు సరఫరా కావడం నేరం. మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేసిన రెస్టారెంట్లోనే దీనిని మగ్గులు, పిచ్చర్ కొలతల్లో విక్రయించాలి. ఈ బీరును ఉత్పత్తి అయిన 36 గంటల్లోనే వినియోగించాలి. సమయం దాటి తే ఆ బీరును నాశనం చేయాల్సిందే! కాగా ఈ బీరు తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు 1,000 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి. ఇందులో 300 చ.మీ. స్థలం ప్లాంట్ కోసం కాగా, వందేసి మీటర్ల చొప్పున సర్వింగ్ ఏరియా, రెస్టారెంట్లకు వినియోగించాలి. అక్టోబర్ నుంచి అందుబాటులోకి ప్రభుత్వం అనుమతించనున్న బ్రూవరీల లెసైన్సు కాలపరిమితి అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని 2015 ఆగస్టు 28న జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ లెక్కన ప్రస్తుతం అనుమతి పొందే మైక్రో బ్రూవరీలు డ్రాట్ బీర్ల ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించిన తరువాత అక్టోబర్ 1 నుంచి వినియోగదారులకు అందించనున్నాయి.