
కరెంట్‌తో జర భద్రం
సొంతంగా మరమ్మతు చేస్తే ప్రమాదమే..
● సమస్యలు ఎదురైతే సిబ్బందికి సమాచారం ఇవ్వాలి ● సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్న అధికారులు
ఖమ్మంవ్యవసాయం: ఈదురుగాలులు, ఇతర కారణాలతో అక్కడక్కడా విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయి. ఆ ప్రాంతానికి మేత కోసం వెళ్తున్న మూగజీవాలు మృత్యువాత పడుతుండగా.. రైతులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈనేపథ్యాన విద్యుత్ ప్రమాదాలపై వినియోగదారులు, రైతుల్లో అవగాహన కల్పించేలా ఖమ్మం ఎస్‌ఈ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఆధ్వర్యాన ఉద్యోగులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా తీగలు తెగిపడినా, ఇతర సమస్యలు ఉన్నా సొంతంగా మరమ్మతు చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడమో లేదా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.