ఖమ్మంగాంధీచౌక్: స్వర సుధా మ్యూజిక్ ఖమ్మం యూనిట్ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. యూనిట్ అధ్యక్షుడు కె. మాధవరావు, ఉపాధ్యక్షుడు వి.వి. రెడ్డి, ప్రతినిధులు పీజే వినయ్‌కుమార్, పిన్నెల్లి యాదగిరి, కీర్తన, రేవతి, జనార్దన్, స్వప్న, రాయప్రోలు సుబ్రమణ్యం, ఆర్.మధు చేసిన గానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యం, సామాజిక సేవకులు డాక్టర్ వనం కృష్ణవేణి, పుసులూరి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి అథ్లెటిక్స్
ఎంపికలు పూర్తి
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలకు 70 మంది బాలబాలికలు హాజరయ్యారు. అండర్–14, 12, 10 విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మందుల వెంకటేశ్వర్లు, ఎండీ షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా వాన
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా ఆదివా రం రాత్రి వర్షం కురిసింది. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురవగా, కొన్నిచోట్ల తేలికపాటి వాన పడింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాత్రి 9 గంటల వరకు ముదిగొండ మండలం పమ్మిలో అత్యధికంగా 38.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చింతకాని మండలం నాగులవంచలో 35.3, బా ణాపురంలో 27.8, నేలకొండపల్లిలో 22.3, మధిరలో 20.5, తిరుమలాయపాలెంలో 18.8, గుబ్బగుర్తిలో 18, ఖమ్మం ఖానాపురంలో 17.3, మధిర ఏఆర్‌ఎస్ వద్ద 17, చింతకానిలో 16.5, రావినూతలలో 16.3, రఘునాథపాలెంలో 15.3, వైరాలో 15, కూసుమంచిలో 14.5, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 14.3, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్ వద్ద 14, పల్లెగూడెంలో 13, లింగాలలో 12, కొణిజర్లలో 11, సిరిపురంలో 10.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వాన పంటల సాగుకు, ఇప్పటికే సాగులో ఉన్న పత్తి, పెసర వంటి పంటలకు మేలు చేస్తుందని, వరినారు పోసేందుకు కూడా దోహదపడుతుందని రైతులు చెబుతున్నారు.
జూలై 5న కౌన్సెలింగ్
సింగరేణి(కొత్తగూడెం):
నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 150 సీట్ల భర్తీ కోసం సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు ఈ నెల 28 నుంచి 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్–30, కంప్యూటర్–30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్– 30, మెకానికల్–30, మైనింగ్–30 సీట్లు ఉన్నా యని, https:# scp. scpolytechnic. com/ online& admission వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసి, కాపీని డౌన్‌లోడ్ చేసి, సంభందిత గని, డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీతో అటెస్టేషన్ చేయించి జూలై 5వ తేదీన జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని పేర్కొంది. వివరాల కోసం 90102 22161, 87901 12515, 94911 44168 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
అలరించిన సినీ సంగీత విభావరి
అలరించిన సినీ సంగీత విభావరి