
ఉద్యమకారులను ఆదుకోవాలి..
ఖమ్మం మామిళ్లగూడెం: ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కే.వీ.కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కొత్త ఆర్టీసీ బస్టాండ్ ఎదుట చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఉద్యమకారుడు అర్వపల్లి విద్యాసాగర్, సీపీఐ నాయకుడు సింగు నరసింహరావుతో కలిసి ఆయన ప్రారంభించాక మాట్లాడారు. ప్రతీ ఉద్యమకారుడికి ఇంటి స్థలంలో పాటు ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు, అమరవీరుల కుటుంబాలకు రూ.25వేలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇటిక్యాల రామకృష్ణ సంఘీభావం తెలపగా, సాయంత్రం పొలిటికల్ జేఏసీ మాజీ కన్వీనర్ కూరపాటి రంగరాజు విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ పసుపులేటి నాసరయ్యతో పాటు అర్వపల్లి విద్యాసాగర్, పద్మాచారి, వెంకటేశ్వరావు, శేషగిరి, సతీష్, మట్టా దుర్గాప్రసాద్‌రెడ్డి, జ్వాల నరసింహారావు, షేక్ అబ్బాస్, రజనీకాంత్, ఎస్.డీ.బురాన్, ఆసిఫ్, నాగుల్‌మీరా, శ్రీనివాస్ నాయక్, పాలకుర్తి కృష్ణ, రాజేందర్‌నాయక్, విజయ్‌కుమార్, ఉమాయాదవ్, వరలక్ష్మి, ధనలక్మి, రమాదేవి తదితరులతో పాటు పెద్దసంఖ్యలో ఉద్యమకారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే
ఆందోళనలు