
‘బెస్ట్ అవైలబుల్’ బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వెంకటేష్, బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యుడు గురుస్వామి డిమాండ్ ఈమేరకు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా వెంకటేష్, గురుస్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 237ప్రైవేట్ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా 25వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతుండగా, రూ.200కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఫలితంగా పాఠశాలల యజమాన్యాలు పిల్లలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యాన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు, విద్యార్థుల తల్లిండ్రులు ప్రసాద్, స్టాలిన్, అశోక్, గోపి, బాలు, సతీష్, నాని, సునీల్, నవీన్, ప్రవీణ్, నాగరాజు, వీరబాబు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో ఉద్యోగి మృతి
వైరా: నేలకొండపల్లి మండలం చెన్నారం పీఏసీఎస్ సీఈఓ ఎస్.వీ.సత్యనారాయణ(58) ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన స్వగ్రామం ఏపీలోని కూనవరం కాగా నేలకొండపల్లిలో స్థిరపడ్డాడు. కాగా, సత్యనారాయణ సోమవారం కూనవరం బయలుదేరాడు. ఖమ్మం నుంచి భద్రాచలానికి డీలక్స్ బస్సులో వెళ్తుండగా వైరా వద్ద నొప్పి వస్తోందని పక్కనే ఉన్న ప్రయాణికుడికి చెబుతూ సీటులోనే కూప్పకూలాడు. దీంతో బస్సును పోలీస్‌స్టేషన్ సమీపాన నిలిపి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వచ్చిన సిబ్బంది, కానిస్టేబుల్ ఘనీ పాషా సాయంతో సత్యనారాయణకు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. దీంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చామని ఎస్సై పి.రామారావు తెలిపారు.

‘బెస్ట్ అవైలబుల్’ బకాయిలు విడుదల చేయాలి