
అటు చెత్త.. ఇటు కంపు
ఉద్యమకారులను ఆదుకోవాలి
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో తెలంగాణ ఉద్యమకారులు దీక్ష చేపట్టారు.
8లో
వర్షాకాలంతో పాటే వచ్చే వ్యాధులతో జనం ఆందోళన చెందుతున్నారు. డ్రెయినేజీలు,
రహదారుల వెంట ఎప్పటికప్పుడు చెత్త
తరలించాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదు. ఫలితంగా దోమలు విజృంభిస్తుండడంతో వ్యాధుల భయం జనాన్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యాన ఖమ్మం
కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో పరిస్థితులను ‘సాక్షి’ సోమవారం పరిశీలించగా
పలు సమస్యలు వెలుగు చూశాయి.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
● విలీనం.. అధ్వానం
ఖమ్మం కార్పొరేషన్‌లో విలీనమైన ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది. ఖమ్మం కార్పొరేషన్‌లో ఖానాపురం హవేలీ గ్రామపంచాయతీ 2012లో విలీనమైంది. అయితే, ఇప్పటివరకు కూడా ఇక్కడ పారిశుద్ధ్యం గాడిన పడలేదు. ఖానాపురం, టేకులపల్లి, లక్ష్మీనగర్, మహిళా ప్రాంగణం, శ్రీకృష్ణానగర్, గోశాల, డైట్ కళాశాల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరిగి కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పలుచోట్ల డ్రైయినేజీలు లేవు. కేఎంసీ 7వ డివిజన్‌లోని టేకులపల్లిలో 2021 – 2022లో డబుల్ బెడ్‌రూం(కేసీఆర్ టవర్స్) గృహ సముదాయం నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 24 ఇళ్ల చొప్పున 54 బ్లాక్‌లను నిర్మించి 1,296 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇక్కడ సుమారు 4వేల మంది వరకు నివసిస్తుండగా డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. కుడి వైపు బ్లాక్‌ల నుంచి మురుగునీరు వెళ్లేందుకు డ్రెయినేజీ నిర్మించినా, ఎడమ వైపు డబుల్ బెడ్‌రూం సముదాయం ముగింపు వద్దే డ్రెయినేజీ ఆపేశారు. దీంతో మురుగునీరంతా ఖాళీ స్థలాల్లో నిలిచి దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన చేయడంతో తాత్కాలికంగా ఇక్కడ ఇంకుడు గుంత తీశారే తప్ప డ్రెయినేజీ మాత్రం నిర్మించలేదు. మామూలు రోజుల్లో ఏమో కానీ చిన్న వర్షం వచ్చినా మురుగునీరు రహదారిపై చేరి మరింత ఇబ్బంది పడుతున్నారు. అలాగే, కాలనీవాసులు రోడ్డు పక్కనే వేస్తున్న చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించకపోవడంతో పేరుకుపోతోంది.
వర్షం వస్తే ఇబ్బందే..
మురుగు నీరు వెళ్లడానికి డ్రెయినేజీ నిర్మాణానికి బదులు ఇంకుడు గుంతలు తీశారు. దీంతో అందులో నీరు నిలిచి మురుగు వాసన, దోమలతో ఇబ్బంది పడుతున్నాం. సముదాయానికి ఓ పక్క డ్రెయినేజీ నిర్మించి ఇంకో పక్క వదిలేయడంతో ఈ సమస్యకు కారణమైంది.
– తుడుం రాములమ్మ, కేసీఆర్ టవర్స్, టేకులపల్లి
ప్రతిపాదనలకే పరిమితం
మా డివిజన్ నుంచి ఏటా రూ.7 కోట్ల ఆదాయం కేఎంసీకి వస్తున్నా కాలనీల్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు లేవు. ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ప్రజల కష్టాలు చూసైనా సమస్యలు పరిష్కరించాలి. – దొంగల సత్యనారాయణ,
కార్పొరేటర్, 7వ డివిజన్
టేకులపల్లి డబుల్ బెడ్‌రూం సముదాయం వద్ద డ్రెయినేజీ లేక నిలిచిన మురుగునీరు

అటు చెత్త.. ఇటు కంపు