
భూనిర్వాసితులకు అండగా నిలుస్తాం..
ఖమ్మంమయూరిసెంటర్: మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న వారికి బీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. భూనిర్వాసితులు పలువురు ఆయనను సోమ వా రం ఖమ్మంలో కలిశారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. మున్నేటి వరదతో ఇబ్బందులు ఎదురుకాకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో తాను రిటైనింగ్‌వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు పనికి రాని భూములు అంటగట్టే యత్నం చేస్తోందని ఆరోపించారు. ఈమేరకు తగిన పరిహారం చెల్లింపు, ప్లాట్ల కేటాయింపులో ప్రజలను ఇబ్బంది పెట్టా లని చూస్తే అడ్డుకుంటామని పువ్వాడ తెలిపారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్