ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌కు వేళాయె... | - | Sakshi
Sakshi News home page

ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌కు వేళాయె...

Jul 1 2025 4:00 AM | Updated on Jul 1 2025 4:00 AM

ఎప్‌స

ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌కు వేళాయె...

● ఇప్పటికే మొదలైన స్లాట్‌ బుకింగ్‌ ● నేటి నుంచి మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన

ఖమ్మంసహకారనగర్‌: ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సెలింగ్‌ మంగళవారం మొదలుకానుంది. జూన్‌ 28వ తేదీ నుంచి స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభం కాగా.. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. ఇందుకోసం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా విద్యార్థులు ఇక్కడి ఎనిమిది ఇంజనీరింగ్‌ కళాశాలలతో రాష్ట్రంలోని ఏ కళాశాలనైనా వెబ్‌ ఆప్ష న్ల ద్వారా ఎంచుకునే అవకాశం ఉంది. స్లాట్‌ బుకింగ్‌, ఇతర వివరాలు http:// tgeapcet.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని, లేదా కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈసారి ‘మాక్‌ అలాట్‌మెంట్‌’

జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ మాదిరిగానే ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు సైతం వెబ్‌ ఆప్షన్‌ పెట్టుకున్నాక ఈసారి నుంచి కొత్తగా మాక్‌ సీటు అలాట్‌మెంట్‌ ఇస్తారు. తద్వారా విద్యార్థులకు వారి ర్యాంక్‌, ఎంచుకున్న కోర్సు ఆధారంగా సీటు ఏ కాలేజీలో వస్తుందో అంచనా వేసుకోవచ్చు. ఆపై ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పించి సీటు ఫ్రీజ్‌ చేస్తారు. కాగా, మూడు దశల కౌన్సెలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశాక మార్చుకునేందుకు ఆగస్టు 16, 17వ తేదీల్లో అవకాశం కల్పించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్‌ సెట్లు వెంట తీసుకెళ్లాలి. టీజీఎప్‌సెట్‌ హాల్‌ టికెట్‌, ర్యాంక్‌ కార్డు, ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ, ఇంటర్‌ మెమోలు, ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్మీడియట్‌ టీసీ, 01–04–2025 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్లాట్‌ బుక్‌ చేసుకున్న రశీదు చూపించాల్సి ఉంటుంది. అలాగే, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 2025–26వ సంవత్సరానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి.

మొదటి విడత కౌన్సెలింగ్‌ ఇలా...

ఈనెల 7వ తేదీ వరకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం ఉంది. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయనుండగా, 6నుంచి 10వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. వీరికి 13న మాక్‌ సీట్ల అలాట్‌మెంట్‌ చేసి 14, 15వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పిస్తారు. చివరగా జూలై 15 తేదీన సీట్ల కేటాయించనుండగా, జూలై 18నుంచి 22వ తేదీ వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

జాగ్రత్తలు తీసుకోవాలి

విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వస్తుంది. దీన్ని ఇతరులకు చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కళాశాలలు, కోర్సులు ఎంపిక సమయాన అప్రమత్తంగా ఉండాలి. మాక్‌ అలాట్‌మెంట్‌ ద్వారా ఓ అంచనాకు రావొచ్చు. ఈనెల 18న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది.

– చండ్ర సుధాకర్‌, కో ఆర్డినేటర్‌,

ఎప్‌సెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌

ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌కు వేళాయె...1
1/1

ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌కు వేళాయె...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement