
కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడిన కోటిరెడ్డి..
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా సింగరేణి ఉద్యోగి, ఐఎన్‌టీయూసీ నాయకుడు కళ్లం కోటిరెడ్డి నిరంతరం సంస్థ అఽభివృద్ధితో పాటు కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడ్డారని సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణ య్య పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన కోటిరెడ్డిని ఇల్లెందు జేకే ఓసీలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ హక్కుల సాధనకు కోటిరెడ్డి చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జాకీర్ హుస్సేన్, చిన్నయ్య, నాయకులు లచ్చిరామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేకే సీఈఆర్ క్లబ్‌లో కూడా సన్మానించగా మున్సిపల్ మాజీ చైర్మన్ మడత రమా వెంకట్‌గౌడ్ మాట్లాడారు. అనంతరం కోటిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం, సింగరేణి అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. ఎమ్మెల్యే కనకయ్య, మడత వెంకట్‌సారథ్యాన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావుతో పాటు నాయకులు, కోటిరెడ్డి కుటుంబ సభ్యులు కళ్లం అమరనాఽథ్, శాలినీరెడ్డి, మురళీరెడ్డి, లావణ్య పాల్గొన్నారు.