
ఉద్యోగులను బలి తీసుకున్న ప్రమాదం
ఏన్కూరు: రోజు మాదిరిగానే విధులకు వెళ్తున్న ఇద్దరు ఉద్యోగులను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఉద్యోగాలకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి బయలుదేరగా.. కాసేపటికే ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందడంతో విషాదం అలుముకుంది. ఏన్కూరు మండలం హిమామ్‌నగర్‌లో సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కొణిజర్ల మండల పల్లిపాడుకు చెందిన ఇమ్మడి రఘుపతి(51) కొత్తగూడెంలో హోంగార్డుగా, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం అంకపాలెంకు చెందిన బత్తుల రాజేష్(30) ఖమ్మంలో ఉంటూ కొత్తగూడెం ఎంఈఓ కార్యాలయంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ద్విచక్ర వాహనంపై రాజేష్ కొత్తగూడెం వెళ్తుండగా పల్లిపాడు వద్ద రఘుపతి లిఫ్ట్ అడిగి ఆయనతోపాటు బయలుదేరాడు. మార్గమధ్యలో ఏన్కూరు మండలం హిమామ్‌నగర్ సమీపాన వీరి బైక్‌ను జూలూరుపాడు నుండి ఏన్కూరు వైపు వస్తున్న వా్‌య్‌న్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేష్, రఘుపతికి తీవ్ర గాయాలు కాగా, 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
బస్సులో వెళ్లినా బతికేవాడేమో...
కొత్తగూడెంలో హోంగార్డుగా పనిచేసే రఘుపతికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే, రాజేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. రఘుపతి ప్రతీరోజు పల్లిపాడు నుంచి బస్సులో కొత్తగూడెం వెళ్లివచ్చేవాడు. అయితే, సోమవారం విధులకు ఆలస్యమవుతుండడంతో పల్లిపాడు వద్ద రాజేష్‌ను లిఫ్ట్ అడిగి ఆయన బైక్‌పై బయలుదేరాడు. దీంతో గమ్యం చేరకుండానే మార్గమధ్యలో ప్రమాదం బారినపడ్డాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏన్కూరు ఎస్‌ఐ రఫీ తెలిపారు.
వ్యాన్ ఢీకొట్టడంతో
ఇద్దరు మృతి

ఉద్యోగులను బలి తీసుకున్న ప్రమాదం