
● మూడు రోజులు ఆగితేనే..
సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. స్థానిక జవహర్‌నగర్‌లో పరిశీలించగా చెత్త సేకరణ రెండురోజులకోసారి జరుగుతోందని స్థానికులు తెలిపారు. ఇక డ్రెయినేజీల్లో మురుగు, చెత్త తీసి రోడ్డుపై వేసి మూడురోజుల తర్వాతే తీసుకెళ్తున్నారని చెప్పారు. జవహర్‌నగర్‌లో సీసీ రోడ్లు ఉన్నా చాలా వీధుల్లో డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో మురుగునీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మరికొన్ని చోట్ల మురుగునీరు ఇంటి ఆవరణలోకి చేరుతోందని కాలనీ వాసులు తెలిపారు.
డ్రెయినేజీలు లేకపోవడంతో...
జవహర్‌నగర్ కాలనీలో డ్రెయినేజీలు నిర్మిస్తే మురుగుకు ఇబ్బంది
ఉండదు. కచ్చా డ్రెయిన్ల కారణంగా ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోతూ దుర్వాసన వస్తుంది. మురుగునీరు రోడ్డుపై నిలుస్తుండడంతో చాలాచోట్ల సీసీ రోడ్డు దెబ్బ తింటున్నాయి.
–చేపలమడుగు నాగరాజు, జవహర్‌నగర్, సత్తుపల్లి
●

● మూడు రోజులు ఆగితేనే..