ఈ జాగ్రత్తలు తప్పనిసరి... | - | Sakshi
Sakshi News home page

ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

Jun 28 2025 5:33 AM | Updated on Jun 28 2025 7:39 AM

ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

●తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలను తాకొద్దు. విద్యుత్‌ సిబ్బందికి లేదా టోల్‌ ప్రీ నెంబర్‌ 1912 ద్వారా సమాచారం ఇవ్వాలి.

●ఇళ్లలో బట్టలు ఆరవేసే వైర్లకు విద్యుత్‌ వైర్లు తాకితే సరఫరా అయి ప్రమాదం జరిగే అవకాశముంది. అందువల్ల బట్టలు ఆరేసుకునేందుకు ప్లాస్టిక్‌ తీగలనే ఉపయోగించాలి.

●స్తంభం నుండి ఇంటికి విద్యుత్‌ సరఫరా అయ్యే వైర్లను రేకులకు తాకకుండా చూడాలి.

●పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల వద్దకు వెళ్లకుండా పర్యవేక్షించాలి. ఎక్కడైనా కరెంట్‌ తెగి పడి ఉంటే సిబ్బందికి సమాచాం ఇవ్వాలి.

●ఇళ్లలో సరైన ఎర్తింగ్‌ చేయించడమే కాక నాణ్యమైన విద్యుత్‌ ఉపకరణాలనే వినియోగించాలి.

●సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి మాట్లాడకపోవడమే మంచిది.

●పొరపాటున ఎవరైనా షాక్‌కు గురైతే రక్షించాలన్న ఆత్రుతలో నేరుగా తాకొద్దు. సదరు వ్యక్తిని వేరు చేయడానికి కర్ర, ప్లాస్టిక్‌ వంటివి వాడాలి.

●రైతులు మోటార్లు, పైపులు, ఫుట్‌ వాల్వ్‌లు నాణ్యమైనవి అమర్చుకుని, విధిగా ఎర్త్‌ చేయించాలి.

●ఎవరైనా విద్యుత్‌ కంచెలు ఏర్పాటుచేస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement