
దొడ్డబళ్లాపురం: ఎన్నో ఏళ్లుగా రామనగర జిల్లాను కంచుకోటగా భావిస్తున్న జేడీఎస్‌కు ఈసారి ఘోర పరాజయం ఎదురైంది. జిల్లాలో నాలుగు స్థానాలపైకి మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగురవేసింది. రామనగర నియోజకవర్గంలో మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌కుమారస్వామి ఘోరంగా ఓటమిపాలయ్యాడు. దీంతో జేడీఎస్ కంచుకోటకు బీటలు పడ్డాయి.
అనూహ్యంగా రామనగరలో కాంగ్రెస్ అభ్యర్థి, డీకే శివకుమార్ ఆప్తుడు ఇక్బాల్ హుసేన్ విజయం సాధించారు. మాగడిలో హెచ్‌సీ బాలక్రిష్ణ, కనకపురలో డీకే శివకుమార్ విజయం సాధించారు. ఒక్క చెన్నట్టణలో మాత్రం కుమారస్వామి ఎలాగో గట్టెక్కారు. చెన్నపట్టణలో అపర భగీరథుడిగా పిలవబడే ఎమ్మెల్సీ యోగేశ్వర్ పరాజయం పాలవడం చర్చనీయాంశంగా మారింది.