మాదకద్రవ్యాలకు దూరంగా ఉందాం | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలకు దూరంగా ఉందాం

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

బళ్లారిఅర్బన్‌: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సిరుగుప్ప పట్టణంలోని శ్రీశైల సాంస్కృతిక భవనంలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అధికారులు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవిత విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం.నాగరాజ్‌, జిల్లా ఎస్పీ డాక్టర్‌ సుమన్‌ పన్నేకర్‌, తహసీల్దార్‌ గౌసియా బేగం, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సుమారు 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని పోలీస్‌ శాఖ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement