పాఠశాలల్లో పండుగ రోజు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో పండుగ రోజు

Jun 2 2026 5:41 AM | Updated on Jun 2 2026 5:41 AM

శివాజీనగర: వేసవి సెలవుల తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సర తొలి రోజు విద్యార్థులకు ఘన స్వాగతం లభించింది. అన్ని బడుల్లో పండుగలా జరుపుకొన్నారు. ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమం, తక్షణం చేరండి అని బాలలు, ఉపాధ్యాయులు ఊరేగింపులు కూడా నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలను శుభ్రం చేసి బ్యానర్లు, తోరణాలతో అలంకరించారు. 1వ తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు తరగతులు ఆరంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎద్దుల బండ్లలో మంగళ వాయిద్యాలతో విద్యార్థులను స్కూళ్లకు పిలుచుకువచ్చారు. పాఠశాలల్లో బాలలకు చాక్లెట్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫారంలను ఇవ్వడంతో బాలల్లో ఆనందం రెట్టింపయింది. ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీల పెద్దలు పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనంతో పాటు స్వీట్స్‌ను పంపిణీ చేశారు.

ఉత్తమ బోధన లభ్యం

శ్రీనివాసపురం: పట్టణంలోని డివిజి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థుల ప్రవేశాల అభియాన్‌ను ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి తమ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేశారు. విద్యాధికారులు మాట్లాడుతూ డివిజి పాఠశాలలో 785 విద్యార్థులు ఉన్నారని, దాఖలాతి అభియాన్‌లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఉత్తమ విద్యభోధన చేయడం వల్ల పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలను ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారని తెలిపారు. సతీష్‌, సొణ్ణప్ప, టీచర్లు పాల్గొన్నారు.

తుమకూరు: తుమకూరు నగరంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న ప్రభుత్వ మోడల్‌ ఉన్నత ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభమైంది. పిల్లలకు చాక్లెట్లు, గులాబీలు అందించి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. పాఠశాలను మామిడి, అరటి తోరణాలతో సుందరంగా అలంకరించారు.

తుమకూరు రైల్వేస్టేషన్‌ రోడ్డు ఉన్నత పాఠశాలలో సంబరం

సోమవారం బెంగళూరు హనుమంతనగర పాఠశాలలో విద్యార్థుల సందడి

హగరిబొమ్మనహళ్లి ప్రభుత్వ పాఠశాలలో..

శ్రీనివాసపురలో అభియాన్‌లో టీచర్లు

బాగల్‌కోటె జిల్లా మురనాలలో బడికి వెళ్తున్న పిల్లలు

1 నుంచి టెన్త్‌ వరకు విద్యాలయాల పునః ప్రారంభం

తోరణాలతో సింగారింపు

బాలలకు ఘన స్వాగతం

Advertisement
 
Advertisement
Advertisement