ఓటర్లు వార్డుల వారీగా ఓటర్ల జాబితాలో తమ పేరును ఆన్‌లైన్‌లో ఎపిక్ నంబరు లేదా పేరుతో చెక్ చేసుకోవచ్చు. త్వరలో పీడీఎఫ్ రూపంలో కూడా అప్‌లోడ్ చేస్తామని మహేశ్వరరావు తెలిపారు. పాలికెల వారీగా ఓటర్ల సహాయవాణి ఏర్పాటుచేసి ఓటర్ల జాబితా పరిష్కరణ గురించి విస్త్రత ప్రచారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటరు సహాయవాణి నంబర్లు పాలికె వెబ్‌సైట్‌లో ఉంటాయని, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. జాబితాలను రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి వార్డులో ప్రతి బూత్‌కు ఒకరిని బూత్ లెవెల్ ఏజెంట్‌ను నియమించి పోలింగ్ కేంద్రాల అధికారులకు ఓటర్ల నమోదులో సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం ప్రత్యేక కమిషనర్ సుష్మా గాడ్బోలె పాల్గొన్నారు.


