ఈ మూడింట తగ్గింపు
● మెస్కాం పరిధిలో: కరావళి, మలెనాడు ప్రదేశాలు, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో యూనిట్‌పై 9 పైసల తగ్గింపు
● హెస్కాం పరిధిలోని ధార్వాడ, బెళగావి, గదగ్, హావేరి, ఉత్తరకన్నడ, బాగల్‌కోటే, విజయపుర జిల్లాల్లో యూనిట్ కు 10 పైసలు తగ్గింపు
● జెస్కాం పరిధిలో కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, బీదర్, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లో యూనిట్ కు 10 పైసల కోత.
బనశంకరి: కర్ణాటకలో విద్యుత్ చార్జీలను పెంచుతూ కేఈఆర్‌సీ నివేదిక ప్రకారం సర్కారు ఆదేశాలిచ్చింది. బెస్కాం పరిధిలో ప్రతి యూనిట్‌పై 56 పైసలు పెరిగింది. ఇందుకు విరుద్ధంగా మెస్కాంలో 9 పైసలు, హెస్కాంలో 10 పైసలు తగ్గించారు. బెంగళూరులోనే అధిక చార్జీల బాదుడు పడింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బెస్కాంకు ఏర్పడిన రూ.2 వేల కోట్ల నష్టం భర్తీ చేయడానికి 2026–27 సంవత్సరంలో ప్రతి యూనిట్ ధరను పెంచాలని ఆదేశించింది. మే 1 నుంచి కొత్త చార్జీలు అమలులోకి వచ్చి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయి.
ఏయే జిల్లాల్లో పెంపు
బెస్కాం పరిధిలోకి బెంగళూరు నగర– రూరల్, కోలారు, తుమకూరు రామనగర, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, దావణగెరె జిల్లాలు వస్తాయి. ఇక్కడ ప్రతి యూనిట్‌పై రూ.56 పైసలు పెరుగుతుంది.
● సెస్క్ పరిధిలోని మైసూరు, చామరాజనగర, మండ్య, హాసన, కొడగుజిల్లాలు ప్రతి యూనిట్ కు 15 పైసలు పెంపు.
యూనిట్‌పై 56 పైసల పెంపు
పలు జిల్లాల్లో తగ్గింపు


