స్వర్ణ పల్లకీలో యతిరాజు | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ పల్లకీలో యతిరాజు

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

మండ్య: మండ్య జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మేలుకోటె దేవస్థానంలో 1009వ తిరునక్షత్ర మహోత్సవం 5వ రోజు కోడై తిరునాల్‌ వేడుకలలో రామానుజాచార్యులకు ఉదయం అశ్వవాహనోత్సవం, రాత్రి పుష్పాలంకృత బంగారు పల్లకీ సేవ సాగింది. రాజాలంకారంలో మిరుమిట్లు గొలిపిన యతిరాజులను చతుర్వీధుల్లో ఊరేగించారు. చెలువ నారాయణస్వామికి గత 15 రోజులుగా జరుగుతున్న కోడై తిరునాళ్‌ మహోత్సవం అమావాస్య రాత్రి ముగిసింది. ఆలయ అంతస్తుపై ఆదిశేషునిపై కూర్చొన్న చెలువనారాయణస్వామికి సర్పనడకలో పడియేట్రం మెట్లు ఎక్కే ప్రత్యేక వేడుకతో వైమాళిగె కోడై తిరునాళ్‌ సమాప్తమైంది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రభను కళ్లారా వీక్షించారు.

మేలుకోటెలో కోడై తిరునాళ్‌

మహోత్సవం సమాప్తం

Advertisement
 
Advertisement
Advertisement