కాంగ్రెస్‌ సంతోషం.. బీజేపీ ఆక్రోశం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సంతోషం.. బీజేపీ ఆక్రోశం

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

తుమకూరు: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంతో తుమకూరులో పోటాపోటీ ప్రదర్శనలు జరగాయి. శనివారం నగరంలోని టౌన్‌హాల్‌ సర్కిల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌.షఫి అహ్మద్‌, ఇక్బాల్‌ అహ్మద్‌ల నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిథ్యం తగ్గించే బీజేపీ కుట్రను ఎంపీలు సమర్థంగా అడ్డుకున్నారని, ఇదొక చారిత్రక విజయమన్నారు.

బీజేపీ నిరసన ప్రదర్శన

ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాంగ్రెస్‌ కూటమి నాయకులు అడ్డుకుని మహిళల హక్కులను హరించారని జిల్లా బీజేపీ మహిళా మోర్చా నాయకులు నగరంలోని బీజీఎస్‌ సర్కిల్‌లో ఆందోళన చేశారు. మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుమిత్రాదేవి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో దేశంలోని 70 కోట్ల మంది మహిళలు విపక్షాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులకు మహిళలపై ఉన్న గౌరవ భావన ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఎమ్మెల్యే సురేష్‌గౌడ, జ్యోతి గణేష్‌, రవిశంకర్‌ హెబ్బాక, జ్యోతి, వసంత, రేఖా, ప్రేమా తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల సంబరాలు

బీజేపీ నిరసన

మహిళా బిల్లు వీగిపోవడంపై

ఆయా పార్టీల ప్రదర్శనలు

Advertisement
 
Advertisement
Advertisement