బళ్లారిఅర్బన్: జిల్లాలోని కురుగోడు, కుడితిని పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస దొంగతనాల కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో దొంగసామాను స్వాధీనం చేసుకున్నారు. కురుగోడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో రూ.1.50 లక్షల విలువైన రాగి తీగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో కేసులో రూ.4.50 లక్షల విలువైన ఎద్దులు, రూ.3.80 లక్షల విలువైన నాలుగు మోటార్ సైకిళ్లను పోలీసులు జప్తు చేసుకొన్నారు. ఈ రెండు కేసుల్లో మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కుడితిని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో దొంగతనం కేసులో లారీకి చెందిన 10 టైర్లు, 4 డిస్కులు కలిపి రూ.2.20 లక్షల విలువైన సామాను స్వాధీనం చేసుకుని ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.
పలువురు నిందితుల అరెస్ట్
రాగి తీగలు, బైక్‌లు స్వాధీనం


