ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచండి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచండి

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

కోలారు: ఎస్సీ, ఎస్టీ జన సంఖ్యను ఆధారంగా చేసుకుని విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలని సీపీఎం కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని లోక్‌సభ సభ్యుడి కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.ఆర్‌.సూర్యనారాయణ మాట్లాడుతూ.. భారత సమాజ వాస్తవాల నేపథ్యంలో ఎస్సీ జాతుల రిజర్వేషన్‌లో వర్గకరణ చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం షెడ్యూల్‌–9లో చేర్చాలన్నారు. పేదలకు అనుకూలమయ్యేలా దేవిందర్‌ సింగ్‌ వర్సస్‌ పంజాబ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి కర్ణాటక ప్రభుత్వం నివృత్త జస్టిన్‌ నాగమోహన్‌ దాస్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను అంగీకరించిందన్నారు. వర్గీకరణ విషయంలో కొన్ని న్యూన్యతలను సరి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు స్థానిక ఎంపీ పార్లమెంటులో గట్టిగా ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, మండలి సభ్యురాలు వి.గీత, పాతకోట నవీన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement