రోడ్డు పక్కన పొలంలోకి బోల్తా పడ్డ రెడీమిక్సర్ ట్యాంకర్ లారీ(ఫైల్)
కారు ఢీకొని మంటలు చెలరేగి కాలిపోయిన ప్రైవేట్ బస్సు(ఫైల్)
రాయచూరు రూరల్ : మానవుడు తన అవసరాల కోసం వాహనాల్లో వెళ్లడం నేడు సహజంగా మారింది. జాతీయ రహదారుల్లో వాహనాలు స్పీడ్‌గా వెళ్లడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. గురు, శుక్రవారం రెండు రోజుల్లో జాతీయ రహదారులపై రక్తపుటేరులు పారాయి. జాతీయ రహదారులు ప్రమాదాలకు హేతువులుగా మారాయి. జాతీయ రహదారి–150ఏ, 167లలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ప్రైవేట్ బస్సులకు మంటలు అంటుకోవడం సర్వసాధారణమైంది. కళ్యాణ కర్ణాటకలో తీవ్రమైన వేసవి ఎండల కారణంగా వాహనాలకు మంటలు అంటుకున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏ సమయంలో ఏ ఆపద వస్తుందో విదితం కావడం లేదు. గత ఏడాది నుంచి దాదాపు 152 మంది ఇలా రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జాతీయ రహదారిలో ఎదురుగా వస్తున్న వాహనాలను సరిగా చూడకుండా తమ వాహనాలను అతి వేగంగా నడపడం వల్లే ప్రాణ నష్టం సంభవిస్తోందనే ఆరోపణలున్నాయి. ఆదమరిచి నిద్ర మత్తు, నిర్లక్ష్యం వంటి వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టర్నింగ్ పాయింట్లు, ఓవర్‌టేక్ చేస్తుండడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి.
అగ్నికి అహుతి అవుతున్న ప్రైవేట్ బస్సులు
వేసవి ఎండలతో వాహనాలకు మంటలు అంటుకుంటున్నాయా?
రెండు రోజుల్లోనే 14 మంది దుర్మరణం


