సాన్విత(ఫైల్)
విశ్వనాథ్(ఫైల్)
రాయచూరు రూరల్: నాటకాన్ని ప్రదర్శిస్తుండగా సముదాయ భవనం బోర్డు జారి తలలపై పడి ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడిన ఘటన శుక్రవారం రాత్రి రాయచూరు జిల్లా మాన్వి తాలూకా బాయల్ మర్చేడ్‌లో చోటు చేసుకుంది. రాత్రి గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకాన్ని సముదాయ భవనం వద్ద స్టేజీకి ముందు కూర్చొని చూస్తున్నారు. ఆ సమయంలో సముదాయ భవనానికి కట్టిన బోర్డు జారి కింద పడింది. దీంతో సాన్విత(2), విశ్వనాథ(9) అనే ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. నలుగురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఒపెక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బసమ్మ(28), లక్ష్మి(17), విశాలాక్షమ్మ(20), యల్లమ్మ(4)అనే క్షతగాత్రులను గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పరామర్శించారు. వైద్యులతో చర్చించి వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాన్వి సీఐ కెంచనరెడ్డి తెలిపారు.
బాయల్ మర్చేడ్ గ్రామంలో విషాదఛాయలు
క్షతగాత్రులకు ఎమ్మెల్యే
బసనగౌడ దద్దల్ పరామర్శ


