అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల అరెస్ట్‌

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

షాహిద్‌ అహ్మద్‌(ఫైల్‌)

అల్తాఫ్‌(ఫైల్‌)

జాబిర్‌(ఫైల్‌)

హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి పట్టణంలో వరుస బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరసీకెరె పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.6.65 లక్షల విలువ చేసే 16 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జాహ్నవి వెల్లడించారు. శనివారం హరపనహళ్లి తాలూకా అరసీకెరె పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు పూర్వాపరాలను వెల్లడించారు. పట్టణంలోని బస్టాండ్‌ ఆవరణలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, ఎస్సై తమ సిబ్బందితో వారిని అదుపులోకి తీసుకుని, విచారించగా దొంగతనాల అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. పోలీసుల విచారణలో నిందితులు అరసీకెరెకు చెందిన ఆఫ్తాబ్‌, జాబిర్‌, షాహిద్‌ అహమ్మద్‌గా గుర్తించినట్లు తెలిపారు. పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని, 16 బైకులను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

ముగ్గురు నిందితుల పట్టివేత

16 ద్విచక్రవాహనాలు స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement