అధికారి సాహసం.. దక్కిన పసి ప్రాణం | - | Sakshi
Sakshi News home page

అధికారి సాహసం.. దక్కిన పసి ప్రాణం

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

రాయచూరు రూరల్‌ : యాదగిరి జిల్లా సురపుర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసులు ఆరుగురు దుర్మరణం పాలు కాగా తొమ్మిది మందికి గాయాలైన ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకా జాతీయ రహదారి–150పై శాంతాపుర వద్ద బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్‌ బస్సు, కలబుర్గి వైపు నుంచి లింగసూగూరు వైపు వెళుతున్న కారు ఢీకొనడంతో కారులో ఉన్న రాయచూరు జిల్లా సిరవారకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. కాగా బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్‌ బస్సులో ప్రయాణిస్తున్న కలబుర్గి ప్రకృతి వైపరీత్యాల విభాగం అధికారి ఉమేష్‌ బిరాదార్‌ వెంటనే బస్సులో నుంచి కిందకు దిగి ప్రాణాలకు తెగించి సమయస్ఫూర్తి, చొరవతో వ్యవహరించి ప్రమాదంలో మంటలు అంటుకున్న కారు తలుపు తెరిచి అందులో నుంచి విరాట్‌ అనే ఏడేళ్ల బాలుడిని ప్రాణాలతో రక్షించినట్లు యాదగిరి జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్‌ తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలకు తెగించి బాలుడిని రక్షించిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement