కేఎస్‌ ఆర్టీసీ బస్సులో మంటలు | - | Sakshi
Sakshi News home page

కేఎస్‌ ఆర్టీసీ బస్సులో మంటలు

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

యశవంతపుర: కేఎస్‌ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా భట్కళ మురుడేశ్వర ఆలయ రోడ్డులో జరిగింది. శుక్రవారం కుమటా నుంచి ప్రయాణికులతో భట్కళ మార్గంలో వెళ్తున్న బస్సు మురుడేశ్వర బస్టాండ్‌ సమీపంలోని దూరవాణి కేంద్రం వద్దకు రాగానే వాహనంలో మంటలు చెలరేగాయి. తక్షణం డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపేసి ప్రయాణికులను దించేశారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ఫైర్‌ సిబ్బంది వచ్చి వచ్చి మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. మంటలు ఎలా వ్యాపించాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జబ్బార్‌ను వెనక్కి

పిలిపించుకోవాలి

మంత్రి సతీశ్‌ జార్కిహొళి

శివాజీనగర: అబ్దుల్‌ జబ్బార్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయటంపై డీసీఎం డీకే శివకుమార్‌తో చర్చించాను. ఆయనను వెనక్కి పిలిపించుకోవాల్సిన అవసరముందని మంత్రి సతీశ్‌ జార్కిహొళి తెలిపారు. డీ.కే.శివకుమార్‌ను కుమారపార్కు ప్రభుత్వ నివాసంలో శుక్రవారం భేటీ చేసి సమాలోచన చేసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అబ్దుల్‌ జబ్బార్‌ను పార్టీలోకి వెనక్కి పిలిపించుకునే విషయంపై మాట్లాడాను. అధ్యక్షుడి వద్ద కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి. దళితులు, మైనార్టీలు తమ ఓటర్లు. అబ్దుల్‌ జబ్బార్‌పై ఆచితూచి, హైకమాండ్‌ అనుమతితో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. డ్యామేజ్‌ కంట్రోల్‌ చేయటానికి తాను వచ్చాను. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు జరుగుతాయి, వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుందన్నారు.

స్టాక్‌ మార్కెట్‌ పేరుతో రూ.77 లక్షలు కొల్లగొట్టారు

మైసూరు: సైబర్‌ కేటుగాళ్లు వేర్వేరు ఘటనల్లో ఇద్దరి నుంచి రూ. 77 లక్షలు కొల్లగొట్టారు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తికి మైసూరుకు చెందిన రేష్మా అనే మహిళ పరిచయమైంది. స్టాక్‌ మార్కెట్‌ మంచి లాభాలు వస్తున్నాయని చెప్పింది. అనంతరం మైసూరులోని గోకులం సమీపంలో ఉన్న ఒక హోటల్‌కు పిలిపించి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి స్టాక్‌ మార్కెట్‌ గురించి వివరించింది. పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చని నమ్మించింది. వారి మాటలు నమ్మిన ఆ వ్యక్తి రూ. 65 లక్షలు ఆమె చెప్పిన ఖాతాలకు జమ చేశాడు. లాభాలు రాకపోగా ఆమె ఫోన్‌ కూడా పనిచేయలేదు. మోసం జరిగిందని గుర్తించిన బాధితుడు వి.వి.పురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా మైసూరులోని విద్యారణ్యపురానికి చెందిన ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌ చూస్తుండగా స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన ఒక ప్రకటన కనిపించింది. ఆ తర్వాత మోసగాళ్లు అతడిని ఒక గుర్తుతెలియని వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చారు. లాభాలు వస్తాయని ఆశ కల్పించి రూ. 12,02,930 దోచుకున్నారు.

అడవి ఏనుగుల విధ్వంసం

దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ తాలూకా బీవీ హళ్లి గ్రామంలో అడవి ఏనుగులు విధ్వంసం సృష్టించాయి.గురువారం రాత్రి గ్రామంలోని దొడ్డేగౌడ అన్యేక్తి ఇంటి కాంపౌండ్‌లోకి జొరబడ్డ ఏనుగులు బొప్పాయ,అరటి ఇతర చెట్లను విరిచేశాయి. తరువాత గ్రామ శివారులోని తోటలు, పంటపొలాలను తొక్కి ధ్వంసం చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement