బనశంకరి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌క్రైం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హోం శాఖ మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. శుక్రవారం బెళగావి నగర పోలీస్ కమిషనర్, జిల్లా పోలీస్ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి జిల్లాలో సైబర్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రగ్స్ పెడ్లర్లపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 15 లక్షల మంది విద్యార్థులను తమ పోలీసులు కలిసి డ్రగ్స్ గురించి జాగృతపరిచారని తెలిపారు. దేశంలోనే న్యాయం అందించడంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందన్నారు. రాయచూరు జిల్లా కవితాళ పోలీస్ స్టేషన్ దేశంలోనే మూడో అత్యుత్తమ స్టేషన్‌గా ఖ్యాతి గడించిందన్నారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా పోలీస్‌స్టేషన్లను జనస్నేహిగా తీర్చిదిద్దామన్నారు. బెళగావిలో రూ.67.79 కోట్లతో పోలీస్ సిబ్బందికి పోలీస్‌గృహ పథకం కింద క్వార్టర్స్ వ్యవస్థ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 40 శాతం పోలీస్ సిబ్బందికి ఈ పథకం కింద ఇళ్లు నిర్మించామన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందికి మంత్రి క్వార్టర్స్ తాళాలు అందజేశారు.
హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్


