లవ్‌ జిహాద్‌ కేసుకు రాజకీయ రంగు | - | Sakshi
Sakshi News home page

లవ్‌ జిహాద్‌ కేసుకు రాజకీయ రంగు

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

హుబ్లీ: కొప్పళ జిల్లాలో లవ్‌ జిహాద్‌ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. వారం రోజులుగా లవ్‌ జిహాద్‌ కేసు చర్చానీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు 16 మంది యువతులకు చెందిన ఆశ్లీల వీడియోలు ముస్తాఫా ఖాదరీ మొబైల్‌ ఫోన్‌లో కనిపించాయి. బీజేపీ నేతలు ఎమ్మెల్సీ హేమలత నాయక్‌ నేతృత్వంలో ఎస్పీ డాక్టర్‌ రామ్‌ హరసిద్ధికి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుతో పాటు, నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముస్తాఫా ఖాదరీ అమాయక హిందూ యువతులను మభ్యపెట్టి మతమార్పిడులకు ప్రయత్నించారని ఆరోపించారు. అతడి మొబైల్‌ ఫోన్‌లో 16 మంది హిందూ యువతులకు సంబంధించి వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. తక్షణం నిందితుడపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్తాఫా ఖాదరీని అరెస్ట్‌ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రావడానికి ముందే ఆ వీడియోలు వైరల్‌ అయితే అమాయక యువతులు భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు పోలీసులు ముస్తాఫాను అరెస్ట్‌ చేయడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా గంజాయి, మట్కా, గుట్కా దందా సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ అయినట్లు వివరించారు. ముస్తాఫా కేవలం లవ్‌ జిహాద్‌ నిందితుడే కాదని.. మట్కా, గ్యాంబ్లింగ్‌, గంజాయి కింగ్‌పిన్‌ అని తెలియజేశారు. నిషేదిత ఊక్కా అతడికి ఎక్కడి నుంచి దొరికిందని బీజేపీ నేతలు నిలదీశారు. తక్షణమే అతడిని అరెస్ట్‌ చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement