పోటీ పరీక్షలపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

పోటీ పరీక్షలపై దృష్టి సారించండి

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

హొసపేటె: మెరుగైన భవిష్యత్తు కోసం విద్యార్థులు పోటీ పరీక్షలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజయనగర జిల్లా కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్‌.ఎన్‌టి శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం కూడ్లిగి పట్టణంలో అంబేడ్కర్‌ ప్రభుత్వ పోస్టు మెట్రిక్‌ బాలల వసతి గృహంలో ఏర్పాటు చేసిన నూతన పరీక్ష గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి రోజుల్లో విద్యార్థులకు భవిష్యత్తు కోసం మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. యూపీఎస్‌సీ, కేపీఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, వార్తా పత్రికలు అధ్యాయన సామాగ్రి, ఉచిత శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్‌ తెగలు, మహిళ అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నేత్రావతి, సీపీఐ ప్రహ్లాద్‌ చన్నగిరి, సాంఘిక సంక్షేమ కార్యాలయ అధికారి ఫక్కీరప్ప, వార్డెన్‌ సయ్యద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement