శరీరానికి ఆహారమే అసలైన ఔషధం | - | Sakshi
Sakshi News home page

శరీరానికి ఆహారమే అసలైన ఔషధం

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

హొసపేటె: ‘మనకు ఆహారమే అసలైన ఔషధం. మన ప్రాచీన సంస్కృతి దీనిని ప్రపంచం అంతటికి పరిచయం చేసింది. ఔషధ రహిత ప్రకృతి వైద్యం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’ అని విజయనగర జిల్లా హరపనహళ్లి తెగ్గినమఠం అధ్యక్షుడు వరసద్యోజాత శివాచార్య స్వామి తెలిపారు. శుక్రవారం డోనూరు శ్రీ చానుకోటి మఠం హరపనహళ్లి జనినియోగ, ప్రకృతి వైద్య ఆస్పత్రి, పరిశోధన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ప్రకృతి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైద్యం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లే బదులు మన ఆహార అలవాట్లు, క్రమశిక్షణ పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మంచి ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన భారతీయ ఆహారం ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దలింగ శివాచార్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement