బనశంకరి: బెంగళూరులో ప్రతి నెలా పెద్ద మొత్తాల్లో మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. ఇక దొరకని డ్రగ్స్ ఎంత మొత్తంలో ఉంటాయో ఊహించుకోవాల్సిందే. ఆ స్థాయిలో మత్తు బాగోతం సాగుతోంది. తాజాగా పోలీసులు 10 మంది డ్రగ్స్‌పెడ్లర్లను గురువారం అరెస్టు చేసి వారి నుంచి రూ.23.63 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. డ్రగ్స్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు.
ఎక్కడెక్కడ ఎంత?
● యలహంక ఉపనగర, దేవరజీవనహళ్లి, బాణసవాడి, కోరమంగల, బొమ్మనహళ్లి, పులకేశినగర పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి.
●6 కేజీల ఎండీఎంఏ, 1 కేజీకి పైగా కొకై న్, 21 కిలోల గంజాయి, 19 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు, బైక్ తదితరాలు లభించాయి.
● యలహంకలో డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియా కు చెందిన పీస్ గౌడియా (27), బలూకా (29) అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా, వారి వద్ద రూ.11.72 కోట్ల విలువచేసే 5.8 కేజీల ఎండీఎంఏ లభించింది.
● బాణసవాడి పోలీసులు నైజీరియావాసి ఒకేవిమ్మర్ (28)ని అరెస్ట్‌చేసి రూ.23.56 లక్షల విలువచేసే 46 గ్రాముల ఎండీఎంఏ 19 గ్రాముల ఎక్స్‌టెసీపిల్స్‌ను సీజ్ చేశారు.
●దేవర జీవనహళ్లిలో సయ్యద్ సజ్జద్ (50) అనే డ్రగ్స్‌పెడ్లరు వద్ద రూ.11.44 కోట్ల విలువచేసే 1.15 కేజీల కొకై న్, బైక్ ను స్వాదీనం చేసుకున్నారు. ఇలా వివిధ ఠాణాల పరిధిలో డ్రగ్స్ విక్రేతలు భారీగా మత్తు పదార్థాలతో పట్టుబడ్డారు.
విలువ రూ. 23 కోట్లు పైనే
బెంగళూరులో స్వాధీనం
ముగ్గురు నైజీరియన్లు సహా 10 మంది అరెస్టు


