పల్టీ పడి పెట్రోల్‌ ట్యాంకర్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

పల్టీ పడి పెట్రోల్‌ ట్యాంకర్‌ దగ్ధం

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

న్యూస్‌రీల్‌

యశవంతపుర: పెట్రోల్‌ను తరలిస్తున్న ట్యాంకర్‌ లారీ బోల్తా పడడంతో మంటలు వ్యాపించి కాలిపోయిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకా కంచినాబాగిలు సమీపంలో జాతీయ రహదారి– 52లో గురువారం మధ్యాహ్నం జరిగింది. మంగళూరు నుంచి హుబ్లీకి పెట్రోల్‌ను తీసుకెళ్తున్న ట్యాంకర్‌ మలుపులో పల్టీ కొట్టింది. దీంతో పెట్రోల్‌ లీకై ఎండల వేడికి మంటలు లేచాయి. రోడ్డు పక్కనే ఉన్న చెట్లు, పొదలకు కూడా వ్యాపించి కాలిపోయాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఫైర్‌ సిబ్బంది గంటల కొద్దీ శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో హైవేలో ట్రాఫిక్‌ స్తంభించింది.

ఓటీపీ చెప్పగానే

రూ.2.70 లక్షలు కట్‌

మైసూరు: బ్యాంకు ఉద్యోగినంటూ సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి రిటైర్డ్‌ అధికారి నుంచి రూ.2.70 లక్షలు కొట్టేశాడు. వివరాలు.. మైసూరులోని సరస్వతీపురం నివాసి అయిన 89 ఏళ్ల వృద్ధుడు భార్యతో కలిసి కారులో వెళుతుండగా, మొబైల్‌కు కాల్‌ వచ్చింది. తాను బ్యాంకు ఉద్యోగినని, మీ డెబిట్‌ కార్డు గడువు ముగిసింది, ఓటీపీ చెబితే కొత్త కార్డును ఇష్యూ చేసి పంపుతామని నమ్మబలికాడు. అతని మాటలను నమ్మిన బాధితుడు తన మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నంబరును చెప్పడంతో, కొంతసేపటికి ఖాతాలో నుంచి రూ.2.70 లక్షలు డ్రా అయ్యాయి. దీంతో సరస్వతీపురం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

మంటల్లో ట్యాంకర్‌

Advertisement
 
Advertisement
Advertisement