బనశంకరి: దొంగల పాలైన రూ.1 కోటి 15 లక్షల విలువచేసే 385 మొబైల్‌ఫోన్లను బెంగళూరు తూర్పు విభాగం పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తూర్పు పరిధిలోని 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన మొబైల్స్‌ను గాలించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ చెప్పారు. సీఇఐఆర్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సాధ్యమైందన్నారు.
బాణసవాడిలో 87, జీవనబీమా నగరలో 81, గోవిందపురలో 35, కేజీ.హళ్లిలో 30, హలసూరులో 30, డీజే.హళ్లిలో 29, హెణ్ణూరులో 19, కమర్షియల్ స్ట్రీట్‌లో 16, పులకేశినగరలో 15, ఇందిరానగరలో 12, బైయప్పనహళ్లిలో 8 మొబైల్స్ పోయినట్లు ఫిర్యాదులు రాగా దొంగల నుంచి రికవరీ చేశారు. ఫోన్ పోయినట్లయితే సీఇఐఆర్ వెబ్‌సైట్‌లో నమోదు చేయడం లేదా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.


