ఉత్తర కర్ణాటకలో భానుడు భగభగ | - | Sakshi
Sakshi News home page

ఉత్తర కర్ణాటకలో భానుడు భగభగ

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో వేసవి ఎండల వేడిమి క్రమంగా అధికం అవుతోంది. కళ్యాణ కర్ణాటకలో యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అంగళ్లను బంద్‌ చేసుకొని కొందరు యజమానులు ఇళ్లలో సేద తీరుతున్నారు. రాయచూరులో మంగళవారం 43.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందని జిల్లాధికారి నితీష్‌ తెలిపారు. కలబుర్గిలో 43.5, బీదర్‌లో 43.4, విజయపుర, బెళగావి, కొప్పళ, గదగ్‌లో 43, యాదగిరి, బాగల్‌కోటెల్లో 42.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తొమ్మిది జిల్లాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు

ఉక్కపోతతో విలవిల్లాడుతున్న ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement