రాయచూరు రూరల్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో అక్రమాలు, నేరాల నివారణకు మూడు జిల్లాల పోలీస్ యంత్రాంగం పరస్పరం సహకరించుకోవాలని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం శక్తినగర్‌లోని కార్యాలయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, సీహెచ్ పౌడర్, గంజాయి, హఫీం ఇతర మత్తు పదార్థాలు కర్ణాటకకు సరఫరా అవుతున్నాయని, వాటిని కట్టడి చేయడానికి సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నేర పరిశోధనలపై నిఘా ఉంచాలన్నారు.


