రాయచూరు రూరల్: నగరసభ ఉప కమిషనర్ సంతోష్‌రాణిపై చర్యలు చేపట్టాలని కర్ణాటక రక్షణ వేదిక డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు ఖలీల్ పాషా మాట్లాడారు. నగరసభలో జనన మరణ ప్రమాణ పత్రాలను ఇచ్చే విషయంలో లంచాలు తీసుకుని ప్రమాణ పత్రాలు ఇవ్వాలని అధికారిణి సంతోష్‌రాణి సిబ్బందికి మౌఖికంగా ఆదేశించారని ఆరోపించారు. అలాంటి అధికారిణి, సిబ్బందిపై చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన వినతిపత్రాన్ని స్థానికాధికారికి సమర్పించారు. ఆందోళనలో రాచయ్య, సుదర్శన్‌రెడ్డి, ఈరణ్ణ, పాండురంగ, గురు, ఆనంద్, మన్నార్, ఫారూక్, మౌలా, బాబు, అబ్దుల్, ఫకృద్దీన్‌లున్నారు.


