రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. గురువారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. నేడు అన్ని విధాలైన వస్తువుల ధరలు మార్కెట్‌లో అధికం కావడంతో వేతనాలను పెంచాలన్నారు. పంచాయతీ వలయంలో విధులు నిర్వహించే కార్మికులకు నెలకు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనాలను సర్కార్ చెల్లించాలని, 20 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారికి పదోన్నతి కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.


