శరవేగంగా డ్యాం గేట్ల పనులు | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా డ్యాం గేట్ల పనులు

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

హొసపేటె: తుంగభద్ర డ్యాంను గురువారం తుంగభద్ర మండలి రిటైర్డ్‌ చైర్మన్‌ రంగారెడ్డి, ఎస్‌ఈ రమణ సందర్శించారు. డ్యాం వద్ద బిగిస్తున్న కొత్త క్రస్ట్‌గేట్ల పనులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. వేగంగా, నాణ్యతగా క్రస్ట్‌గేట్ల బిగింపు పనులను చేపడుతున్న తీరును చూసి అధికారులను అభినందించారు. ఇప్పటికే డ్యాంకు మొత్తం 28 కొత్త క్రస్ట్‌గేట్లను బిగించడం పూర్తయినట్లు అధికారులు వారి దృష్టికి తెచ్చారు. మిగతా ఐదు గేట్లను కూడా త్వరగా బిగించేందుకు పనులు వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టరుకు సూచించారు. అదే విధంగా డ్యాం వద్ద గేట్ల బిగింపు, నిర్మాణ పనుల ప్రగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలి కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్‌, ఎగ్జిక్యూటర్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, డ్యాం సెక్షన్‌ అధికారి జ్ఞానేశ్వర్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

తుంగభద్ర డ్యాంను సందర్శించిన

బోర్డు రిటైర్డ్‌ చైర్మన్‌ రంగారెడ్డి

ఇప్పటికే 28 కొత్త క్రస్ట్‌గేట్ల అమరిక పనులు పూర్తయినట్లు వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement