మినీ బస్సు, ట్రాక్టర్‌ ఢీ.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

మినీ బస్సు, ట్రాక్టర్‌ ఢీ.. ఒకరు మృతి

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

సాక్షి బళ్లారి: జిల్లాలోని కురుగోడు పట్టణ శివార్లలోని యల్లాపుర క్రాస్‌ వద్ద మినీ బస్సు, ట్రాక్టర్‌ ముఖాముఖి ఢీకొనడంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పళ జిల్లా చళ్లారి గ్రామానికి చెందిన వారు మినీ బస్సులో గురువారం కురుగోడు తాలూకాలో వెలసిన తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా యల్లాపుర క్రాస్‌ సమీపంలో పేడ ఎరువును పొలానికి తరలిస్తున్న ట్రాక్టర్‌ను మినీ బస్సు ఢీకొంది. దీంతో ఘటన స్థలంలోనే రత్నమ్మ(70) అనే మహిళ మృతి చెందగా, మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కురుగోడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మినీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కురుగోడు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.

ఐదుగురికి గాయాలు

కురుగోడు వద్ద ఘటన

Advertisement
 
Advertisement
Advertisement