రెండో రోజూ ఆక్రమణల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

రెండో రోజూ ఆక్రమణల తొలగింపు

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

సాక్షి బళ్లారి: నగరంలో ప్రభుత్వ స్థలాలు, పుట్‌పాత్‌ల్లో మహానగర పాలికె చేపట్టిన ఆక్రమణల తొలగింపు కొనసాగింది. రాయల్‌ సర్కిల్‌ నుంచి బెంగళూరు రోడ్డులో ఏపీఎంసీ వరకు పుట్‌పాత్‌లో రోడ్డుకు ఇరు వైపుల బుధవారం ప్రారంభమైన ఆయా షాపుల, హోటళ్ల యజమానులు, చిరు వ్యాపారుల ఆక్రమణలను తొలగించే కార్యాచరణ గురువారం రెండో రోజు కూడా జేసీబీలు, ట్రాక్టర్లతో కొనసాగించారు. సిటీ కార్పొరేషన్‌ కమిషనర్‌, జోనల్‌ అధికారులు పోలీసుల సంయుక్త కార్యాచరణలో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలను తొలగించాలని ఇటీవల పాలికె సమావేశంలో తీర్మానించడంతో మహానగర పాలికె పరిధిలోని పలు ప్రాంతాల్లో కబ్జా చేసిన స్థలాల్లో కార్పొరేషన్‌ అధికారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో చేరి ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ముందుగా హవంబావిలో నకిలీ రికార్డులతో స్వాధీనం చేసుకొన్న స్థలాల్లో ఆక్రమణలను అధికారులు తొలగించారు.

పుట్‌పాత్‌, ప్రభుత్వ స్థలాల

కబ్జాలపై పాలికె అధికారుల కొరడా

Advertisement
 
Advertisement
Advertisement