రాయచూరు రూరల్: నేడు ప్రతి ఒక్కరినీ బాధిస్తున్న వ్యాధి గుండెపోటు అని, ఎక్మో యంత్రం మానవుడి గుండెపోటు వ్యాధిని అరికడుతుందని హైదరాబాద్ యశోద ఆస్పత్రి ప్రత్యేక వైద్యుడు భరత్ విజయ్ పురోహిత్ వెల్లడించారు. గురువారం వీజీకే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె పోటు వచ్చిన వెంటనే వ్యాధి నియంత్రణలోకి తేవడానికి నూతనంగా ఎక్మో యంత్రం సహాయంతో బతికించుకోడానికి వీలుంటుందన్నారు. గత మూడేళ్ల నుంచి వేలాది మందికి ఎక్మో యంత్రం ద్వారా ప్రాణం పోశామన్నారు. ఎక్మో యంత్రం(ఆర్టీఫిషియల్) సహాయంతో ప్రాణాలను రక్షించామనే సంతృప్తి తమకు ఉందన్నారు. యంత్రానికి రూ.3 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. కళ్యాణ కర్ణాటక భాగంలో గుండెపోటు వ్యాధి అధికంగా వస్తుండడంతో ప్రజలకు వివరించడానికి ఎక్మో యంత్రం సహాయ పడుతుందన్నారు. ప్రపంచంలో 20 కేంద్రాల్లో హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి మాత్రమే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు అజిత్, వెంకటేశ్వరన్ కోల్లాలున్నారు.


