లవ్‌ జిహాద్‌ కేసులో మరో మలుపు | - | Sakshi
Sakshi News home page

లవ్‌ జిహాద్‌ కేసులో మరో మలుపు

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

హొసపేటె: ముస్తఫా ఖాద్రిపై ఉన్న లవ్‌ జిహాద్‌ కేసుకు సంబంధించి కొప్పళ జిల్లాలో మరో సంచలనాత్మక సమాచారం బయటకు వచ్చింది. ఇది అక్కడ పెను వివాదానికి కారణమైంది. నిందితుడు ముస్తఫాకు గోవా, ముంబైల్లోని మట్కా బుకీలతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నాడని అనుమానిస్తున్నారు. ఈ విషయమై విశ్వ హిందూ పరిషత్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొప్పళ తాలూకాలోని కంప్లి గ్రామానికి చెందిన ముస్తఫా ఖాద్రికి గోవా, ముంబైల్లోని పలుకుబడి గల మట్కా బుకీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. వారి నుంచి అందిన డబ్బుతో అతను అమాయక అమ్మాయిలను ఆకర్షించి, సరదాగా గడుపుతున్నాడని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

కేసు నేపథ్యం ఏంటి?

కొప్పళలో ముస్తఫా ఖాద్రి అనే వ్యక్తి తాను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ హిందూ అమ్మాయిలను మోసం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అతని మొబైల్‌ ఫోన్‌లో పలువురు అమ్మాయిలతో ఉన్న అశ్లీల వీడియోలు, ఫోటోలు లభ్యమయ్యాయి. ఈ వీడియోలను తన వద్ద ఉంచుకుని అతను అమ్మాయిలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని తెలిసింది. ఈ విషయం వెలుగులోకి రాగానే విశ్వ హిందూ పరిషత్‌, హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్తఫా తనపై లైంగిక దాడి చేశాడని ఒక యువ బాధితురాలు ధైర్యం చేసి ఫిర్యాదు చేసింది. తన మొబైల్‌లో అశ్లీల వీడియోలు పంపినట్లు అనుమానిస్తున్న నిందితుడు ఆ వీడియోలను మరెవరికై నా షేర్‌ చేశాడా? లేదా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మట్కా బుకీల డబ్బు లావాదేవీలకు, అమ్మాయిల వీడియోలకు మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.

నిందితుడికి అంతర్రాష్ట్ర మట్కా

బుకీలతో సంబంధాలు

హవాలా మార్గంలో అందిన డబ్బుతో ముస్తఫా విలాసవంతమైన జీవితం

Advertisement
 
Advertisement
Advertisement